Friday, September 18, 2026
HomeCrime Newsఎన్టీఆర్ స్టేడియంలో ఎలక్ట్రికల్ కారులో మంటలు 

ఎన్టీఆర్ స్టేడియంలో ఎలక్ట్రికల్ కారులో మంటలు 

హైదరాబాద్, నవంబర్ 16, అద్దం న్యూస్ :  హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పార్కింగ్ చేసి ఉన్న Ts09 gd 1262 నంబర్ గల ఎలక్ట్రిక్ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే ఎలక్ట్రిక్ కారులో మంటల వల్ల పక్కనే ఉన్న మరో Ts 25 t 7488 నంబర్ గల కారుకి మంటలు అంటుకున్నాయి. పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు ఎగిసి పడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ ను రప్పించారు. ట్రాఫిక్ ఎస్ఐలు పెంటయ్య, లక్ష్మయ్య, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ వి కారు పూర్తిగా కాలి బూడిద కాగా మరో కారు డిక్కీ భాగం కాలిపోయింది. డిక్కీ లో సి ఎన్ జి గ్యాస్ సిలిండర్ ఉండడంతో అందరూ భయపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ హాని కలుగలేదు. అయితే ప్రమాదం జరిగిన కారు యాక్సిడెంట్ అయితే గత కొన్ని రోజులుగా అక్కడే పార్క్ చేసి ఉంది.ధర్నా చౌక్ లో బీసీల న్యాయ సాధన దీక్షకు వచ్చానని, భోజనం చేసి వచ్చేలోపు తన కారుకు మంటలు అంటుకున్నాయని  Ts 25 t 7488 నంబర్ గల కారు ఓనర్ రాములు ” అద్దం న్యూస్ ” ప్రతినిధితో చెప్పారు.  తాను ఊబర్లో కారు అద్దెకు నడిపిస్తానని, ఇప్పుడు కారు కాలిపోవడంతో తనకు ఉన్న ఆధారం పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page