ముషీరాబాద్ మ‌హంకాళి అమ్మ‌కు తొలి బోనం

ముషీరాబాద్ మ‌హంకాళి అమ్మ‌కు తొలి బోనం



హైదరాబాద్, జులై 13, అద్దం న్యూస్ :   ఆషాడ‌మాసంలోని బోనాల ఉత్స‌వాలు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రారంభ‌మ‌య్యాయి. ముషీరాబాద్ మ‌హంకాళి అమ్మ‌వారి ఆల‌యంలో ఆదివారం అమ్మ‌వారికి తొలి బోనం స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పోతురాజుల విన్యాసాల‌తో ముషీరాబాద్ పుర‌వీధుల్లో బోనాన్ని ఊరేగించి అనంత‌రం అమ్మ‌వారికి సమ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఈవో మ‌హేంద‌ర్, ముషీరాబాద్ మ‌హంకాళి దేవాల‌యం మాజీ ఛైర్మ‌న్ ఎయిర్‌టెల్ రాజు, భ‌క్తులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page