ఉజ్జయిని మహాంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న టిడిపి నేతలు
హైదరాబాద్, జులై 13, అద్దం న్యూస్ : సికింద్రాబాద్ లస్కర్ బోనాలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ పి.సాయిబాబా, పార్లమెంటు నాయకులతో కలిసి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకుని, తెలంగాణ సుభిక్షంగా ఉండి, ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని కోరుకున్నారు. సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని.. ఇతర మంత్రులు కాని భక్తులకు అంతరాయం కలగకుండా ఉదయాన్నే తెల్లవారు జామున వచ్చి దర్శనం చేసుకురని వెళ్లేవారన్నారు. ఈ రోజు భక్తుల దురదృష్టమైమో కాని అడుగడుగునా భక్తులకు అంతరాయం కలిగిస్తూ విఐపి దర్శనాల పేరుతో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, వారి అనుచరులు ఘడియ ఘడియకు ఒకరు వస్తూ భక్తులను ఇబ్బంది పెడుతూ అంతరాయం కలిగిస్తున్నారని మండిపడ్డారు. దీనికి తోడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ భక్తులకు తీవ్రమైన అంతరాయాన్ని కలిగిస్తున్నారని అన్నారు. పోలీసులు క్యూలైన్లలో ఉన్న భక్తులను కంట్రోల్ చేసే పని పక్కన పెట్టి, వీఐపీల సేవలోనే తరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, ఎబిఆర్ మోహన్, భాను ప్రకాష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply