శ్రీ శ్రీ శ్రీ ఈదమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న
మాజీ కార్పొరేటర్ ఎ.పావని
హైదరాబాద్, జూన్ 29, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని దోభీఘాట్‌లో పునర్నిర్మాణం సోమవారం శ్రీ శ్రీ శ్రీ ఈదమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి పూజలను నిర్వహించారు. దోభీ ఘాట్ బస్తీ నాయకులు మాజీ కార్పొరేటర్ పావనికి, బిజెపి నాయకులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, పాల శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, సాయిగౌడ్, శ్యామ్, బస్తీ ఆలయ కమిటీ సభ్యులు వెంకటేష్, నగేష్, డి.రమేష్, సి.సురేష్, ఎ.విష్ణు, మల్లికార్జున్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply