బిజెపి నేతలను పరామర్శించిన
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్, ఏప్రిల్ 17, అద్దం న్యూస్ : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం పలువురు బిజేపి సీనియర్ నాయకులను పరామర్శించారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌కు చెందిన బిజెపి నాయకుడు రాజు తండ్రి మల్లయ్య ఇటీవల మృతి చెందారు. రాజును శుక్రవారం బండారు దత్తాత్రేయ పరామర్శించారు. కె.మల్లయ్య మృతి చెందడం బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. అలాగే ఇటీవల మృతి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు పున్న రాజమోహన్ సతీమణి పున్న మాధవి కుటుంబసభ్యులను దత్తాత్రేయ పరామర్శించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు వైద్యనాథ్, శ్రీకాంత్, పాల శ్రీనివాస్, ఎం.ఉమేష్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply