Friday, September 18, 2026
HomeHyderabadతెలంగాణ జాగృతి యువజన విభాగం హైదరాబాద్ కన్వీనర్‌గా ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్ నియామ‌కం

తెలంగాణ జాగృతి యువజన విభాగం హైదరాబాద్ కన్వీనర్‌గా ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్ నియామ‌కం

హైదరాబాద్, మే 17, అద్దం న్యూస్ :   తెలంగాణ జాగృతి యువజన విభాగం హైదరాబాద్ కన్వీనర్‌గా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత నియామ‌క‌ప‌త్రాన్ని మ‌నోజ్ గౌడ్‌కు అంద‌చేశారు. ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్ నిన్న‌టి వ‌ర‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం తెలంగాణ జాగృతి క‌న్వీన‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ జాగృతి యువజన విభాగం హైదరాబాద్ కన్వీనర్ ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్ మాట్లాడుతూ… త‌న పై న‌మ్మ‌కంతో తెలంగాణ జాగృతి యువజన విభాగం హైదరాబాద్ కన్వీనర్‌గా నియ‌మించినందుకుగాను తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్న‌ట్లు తెలిపారు. సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని క‌విత‌క్క సూచ‌న మేర‌కు ప‌ని చేస్తామ‌న్నారు.

నియామ‌క‌ప‌త్రం
నియామ‌క‌ప‌త్రం
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page