హైదరాబాద్, మే 17, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నివి చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో రెండు రోజుల పాటు జరిగిన గాంధీనగర్ అండర్ –14 క్రికెట్ టోర్నమెంట్‌లో ఛత్రపతి శివాజీ బాయ్స్ టీమ్ విజేతగా నిలిచింది. గత రెండు రోజులపాటు శ్రీనివాస గ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో 16 టీంలు పాల్గొనగా, శనివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఐకాన్ స్టార్స్, ఛత్రపతి శివాజీ బాయ్స్ టీమ్ ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఐకాన్ స్టార్స్ టీమ్ పై ఛత్రపతి శివాజీ బాయ్స్ టీమ్ గెలిచింది. విజేతకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్, సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ ఆనంద్, ఇండియన్ మాజీ క్రికెటర్ వెంక ప్రతాప్ లు హాజరై బిజేత టీమ్ అయిన ఛత్రపతి శివాజీ బాయ్స్ టీమ్‌కు పది వేల నగదు బహుమతి, రన్నరప్‌గా నిలిచిన ఐకాన్ స్టార్స్ టీమ్‌కు 5 వేల రూపాయల నగదును అందచేశారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రికెట్ టీమ్‌లకు ప్రశంసా పత్రాలను, సర్టిఫికెట్లను, మెమోంటోలను అందచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, కృష్ణ ప్రసాద్, ఎం.ఉమేష్, మహమూద్, ప్రకాష్ యాదవ్, శివకుమార్, నర్సింహ, సాయి కుమార్, ఆనంద్ రావు, డి.కుమార్, యాదగిరి, అరుణ్ కుమార్, రాహుల్, సాయి తేజ, గోపి, జ్ఞానేశ్వర్, నీరజ్, ప్రశాంత్, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply