Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఘ‌నంగా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు

ఘ‌నంగా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు

📰 Generate e-Paper Clip

ఘ‌నంగా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 6, అద్దం న్యూస్ :      మాజీ మంత్రి, స‌న‌త్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బ‌ర్త్ డే వేడుక‌లు సోమ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లిలో ఘ‌నంగా జ‌రిగాయి. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో జ‌రిగిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి తినిపించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… తెలంగాణ రాజకీయాల్లో శ్రమశీలి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసే నాయకునిగా ప్రసిద్ధి చెందారన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారానికి కృషి చేసే నిబద్ధత ఆయనలో ఎల్లప్పుడూ కనిపిస్తుంద‌ని తెలిపారు. అభివృద్ధి పట్ల దృఢమైన కట్టుబాటు, సామాజిక సేవలో నిరంతర ప్రయత్నం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జయసింహ, ప‌ర‌కాల ర‌జినికాంత్ గౌడ్‌, శంకర్, దామోదర్ రెడ్డి, ప్రభాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page