హైదరాబాద్, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) : గణనాథుడికి ఆశీర్వాదం, ఆశిస్సులు ప్రజలందరి పై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ దోమలగూడ జెబి అపార్ట్‌మెంట్ చౌరస్తా వద్ద నవరాత్రి శక్తి వ్యాయామశాల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో విఘ్నేశ్వరుడికి ఘనంగా పూజలు జరిగాయి. గురువారం సర్వే సాయి తేజ్ ఆధ్వర్యంలో జరిగిన పూజలకు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహానికి సర్వే సత్యనారాయణ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణకు శాలువా కప్పి సర్వే సాయి తేజ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ… గత 60 సంవత్సరాల నుంచి నవరాత్రి శక్తి వ్యాయామశాల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేషుడిని ప్రతిష్టించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కెఆర్‌కె ప్రసాద్, శాంతి కుమార్, వికాస్ ఠాకూర్, సుదర్శన్, వెంకట్ రెడ్డి, డి.బిక్షపతి, కనక రాజు, సాయి కిరణ్ యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.![]()
గణనాథుడికి పూజలు చేసిన మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ
RELATED ARTICLES

