గాంధీనగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్, ఫిబ్రవరి 7, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో రూ.30 లక్షల నిధులతో జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ 2వ అంతస్తు నిర్మాణ పనులకు, రూ.14 లక్షల నిధులతో సంజీవయ్యనగర్ బస్తీ కమ్యూనిటీహాల్ బ్యాలెన్స్ పనులు, రూ.26 లక్షల నిధులతో జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ మరమ్మతు నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కవాడిగూడ సర్కిల్–40 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పుష్పలత, ముషీరాబాద్ తహశిల్థార్ రాణా ప్రతాప్ సింగ్, అన్ని శాఖల అధికారులు, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జైసింహా, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్‌రావు, బిజెపి నాయకులు శ్రీకాంత్, దామోదర్, రాజు, మహమూద్, సాయికుమార్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సంతోష్, నీరజ్, శశికాంత్, బిఆర్ఎస్ పార్టీ మీడియా ఇన్‌చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply