Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadరూ.1.83 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రూ.1.83 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

రూ.1.83 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హైదరాబాద్, ఫిబ్రవరి 10, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో రూ.1.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, గాంధీనగర్ కార్పొరేటర్ పావని, కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ వార్డులోని గంగపుత్ర కాలనీలో రూ.70 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, గాంధీనగర్లోని మాల బస్తీలో రూ.42 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులు, కవాడిగూడ వార్డులోని అడ్వొకేట్ కాలనీలో రూ.30 లక్షల తో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రామ్‌గోపాల్‌పేట్ వార్డులోని కృష్ణనగర్ కాలనీలో రూ.41 లక్షల తో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… నగరంలోని కాలనీలు, బస్తీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి గడిచిన ఐదేండ్లలో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు.

డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… జిహెచ్ఎంసి పరిధిలో పౌర సదుపాయాల పెంపునకు జీహెచ్ఎంసీ అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీఎంసి ప్రవీణ్ కుమార్, ఎస్ఈ ఆశలత, ఈఈ సువర్ణ, డిఈ గీత, ఏఈ విశేష్ నాయక్, జీహెచ్‌ఎంసీ అధికారులు, బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page