...

బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే స్వాతంత్య్ర‌ ఉద్యమం తరహాలో పోరాటం – బీసీల ధర్మ పోరాట దీక్షలో వక్తలు

» బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలు వెళితే బీసీలు రాష్ట్రంలో అగ్గి రాజేస్తతాం

» బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

»  42 శాతం రిజర్వేషన్లు బీసీలకు న్యాయమైనవే – దత్తాత్రేయ

»  బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తొందరపాటు చర్యలు వద్దు

కేంద్రంతో రాష్ట్రం ప్రభుత్వం కొట్లడితే బిఆర్ఎస్ కలిసి వస్తుంది – మధుసూదన్ చారి, శ్రీనివాస్ గౌడ్
ఎల్.రమణ

»  పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ల బీసీ ఉద్యమాన్నీ ఉదృతం చేయాలి

అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లడానికి సీఎం రేవంత్ ను ఒప్పిస్తాం

తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ ఉద్యమం చేస్తే కేంద్రం దిగురాక తప్పదు – మధుయాష్కీ, అద్దంకి దయాకర్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 13, అద్దం న్యూస్ :    బీసీ దీక్షలతో ఢిల్లీ దిగి రావాలని, రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షoతో వెళ్లాలని, పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ కేంద్రంపై పోరాడడానికి రాజకీయ కార్యచరణ ప్రకటించాలని, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీతో కొట్లాడుతారో, బీసీలకు దోషులుగా నిలబడతారో కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చుకోవాలని బిసిల ధ‌ర్మ పోరాట దీక్ష‌లు ప‌లువురు వ‌క్త‌లు అన్నారు. బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని, బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే స్వాతంత్య్ర‌ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సి వ‌స్తుంద‌ని బీసీల ధర్మ పోరాట దీక్షలో ప‌లువురు వ‌క్త‌లు స్ప‌ష్టం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి, 9 వ షెడ్యూల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో బిసి జేఏసి వ‌ర్కింగ్ ఛైర్మ‌న్‌ జాజుల శ్రీనివాస్ గౌడ్‌ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధ‌ర్నాచౌక్‌ వద్ద బీసీల ధర్మ పోరాట పాటు దీక్ష నిర్వహించారు.

ఈ దీక్ష‌కు ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, మధుసూదన చారి, ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, 40 బీసీ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షoతో వెళ్లాలని, పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ కేంద్రంపై పోరాడడానికి రాజకీయ కార్యచరణ ప్రకటించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీతో కొట్లాడుతారో, బీసీలకు దోషులుగా నిలబడతారో కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలు వెళితే బీసీలు రాష్ట్రంలో అగ్గి రాజేస్తారన్నారు. ఈనెల 17న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తొందరపడి బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే బీసీలకు దోషిగా కాంగ్రెస్ నిలబడుతుందన్నారు. ఢిల్లీతో కాంగ్రెస్ పోరాడితే దేశంలోని బీసీల అండ కాంగ్రెస్ ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఇప్పటికే గత సెప్టెంబర్ 18 న రాష్ట్ర బంద్ నిర్వహించామని, నవంబర్ 6 పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన దీక్షలు చేపట్టామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు సాధించడం కోసం గల్లీ నుండి ఢిల్లీ దాకా బీసీలు పోరాడుతారని 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు.

మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించడం న్యాయమైనదే అని అన్నారు. జనాభా ఉన్నప్పుడు, బీసీలు వెనుకబడి ఉన్నారని కమిషన్లు తేల్చినప్పుడు బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటే తప్పులేదన్నారు. బీసీల వాట బీసీలకు దక్కితినే దేశంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోదీతో మాట్లాడతాన‌న్నారు. బీసీ రిజర్వేషన్లతో పాటు రాష్ట్రంలో జనాభా ప్రకారం బీసీల రాజకీయ రంగంలో, రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల వాటా ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సూచించారు. బీసీల పోరాటానికి నా వంతుగా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

ఎమ్మెల్సీలు మధుసూదన్ చారి, ఎల్.రమణ, మాజీ మంత్రి విశ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ… బీసీ రిజర్వేషన్ల పై రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యలు చేపట్ట వద్దన్నారు. కామారెడ్డి డిక్టరేషన్ కు కట్టుబడి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలన్నారు. రెండు సంవత్సరాలు ఆగి మరో రెండు నెలలు ఆగితే బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందన్నారు. సీఎం నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిపై ఒత్తిడి పెంచాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో కాంగ్రెస్ పోరాడితే బిఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తుందన్నారు. బీసీలను మోసం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేద‌న్నారు. బీసీ ఉద్యమం పట్టణం నుండి పల్లెలకు విస్తరించింది, నాయకుల చేతుల నుండి ప్రజల చేతికి వెళ్లిందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సమయంలోనే బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గకుండా పోరాటం నడుపుతామ‌న్నారు. కేంద్రంతో రాష్ట్రం ప్రభుత్వం కొట్లడితే బిఆర్ఎస్ కలిసి వస్తుందన్నారు.

ఎమ్మెల్సి అద్దంకి ద‌యాక‌ర్‌, మాజీ ఎంపి మధు యాష్కి గౌడ్ లు మాట్లాడుతూ… పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్నీ ఉదృతం చేయడం అభినందనీయమ‌న్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లడానికి సీఎం రేవంత్ ను ఒప్పిస్తామ‌న్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా బిజెపి మొఖాలు అడ్డుతుందన్నారు. బీసీ ప్రధానిగా ఉన్న బీసీలకు న్యాయం జరగకపోవడం చాలా దురదృష్టకరమ‌న్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి పార్లమెంట్ వేదికగా బీసీల తరఫున పోరాడడానికి కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ దృష్టి సారించాలని కోరుతామ‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లతో మాట్లాడి బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి కార్యాచరణ రూపొందించాలని అడుగుతామ‌ని తెలిపారు. బీసీలకు అన్యాయం జరిగే చర్యలు కాంగ్రెస్ ఎప్పుడు తీసుకోదని స్ప‌ష్టం చేశారు. బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాడుతుందని, బీసీల విషయంలో ఇప్పటికే రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆపి బీసీలకు న్యాయం చేయాలని చూస్తున్నామ‌న్నారు.

తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షులు, మాజీ ఎమ్మెల్సి, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ… బీసీల డిమాండ్ న్యాయమైనది ప్రజాస్వామ్యమైందన్నారు. పరిష్కరించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాలు పట్టింపులకు పోతే తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ ఉద్యమం కూడా ఉవ్వెత్తున లేస్తుందన్నారు. బీసీ ఉద్యమంలో పార్టీల కచ్చితంగా జేఏసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల‌ని, జేఏసీ చేపట్టి కార్యక్రమానికి మేము అండగా ఉంటాన‌న్నారు.

బిసి జేఏసి మీడియా కో–ఆర్డినేటర్స్ గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ ల అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన బీసీల ధర్మ పోరాట దీక్షలో బీసీ సంఘాల జేఏసీ, అఖిలపక్ష నేతలతో పాటు బిసి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మ, సంచారజాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరస్వామి, బిసి ఏ కులాల అధ్యక్షుడు ప్రొఫెసర్ భాగయ్య, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు బి.మణి మంజరి, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నేతలు ఉప్పరి శేఖర్ సగర, వేముల రామకృష్ణ, నందగోపాల్, దీటి మల్లయ్య, కెపి మురళీకృష్ణ, పిట్ల శ్రీధర్, వరికుప్పల మధు, ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖర్ గౌడ్, దేశ బోయిన రమ, నిరంజన్, వెంకటేష్ గౌడ్, వారాల శ్రీనివాస్, ఓయూ ఓయూ జేఏసీ నేతలు మాలింగ లింగస్వామి, నిజ్జన రమేష్ ముదిరాజ్, కవుల జగన్నాథం, బూర మల్సూర్ గౌడ్, తారకేశ్వరి, సమతా యాదవ్, స్వర్ణ గౌడ్, సంధ్యారాణి, కుల్చ సుజాత, శ్యామల, గౌతమి, వాణి, పిట్ల నాగేష్, మాదేశి రాజేందర్, ఉదయ్ నేత, తిరుమల నాయుడు, జోర్రిగల శ్రీనివాస్, గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, రాజేశ్వరి, విజయలక్ష్మి, మీనా దేవి, కొమ్ము శ్రీనివాస్ యాదవ్, జూలూరి గౌరీ శంకర్, గిరిజన సంఘం నాయకులు సంజీవ నాయక్, సిపిఎం నేత ఆశన్న, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్, ప్రొఫెసర్ బాగయ్య లతో పాటు 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, 40 బీసీ సంఘాల అధ్యక్షులు, 10 ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, మహిళా సంఘాల నేతలు, ఓయూ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.