Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadపలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

📰 Generate e-Paper Clip

పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

 హైదరాబాద్, ఆగ‌స్టు 31, అద్దం న్యూస్ :   హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని   సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ( కేడీడబ్ల్యూఎస్పీ ) ఫేజ్- 3,   పంపింగ్ మెయిన్‌ కి సంబంధించి 1400 ఎంఎం డ‌యా పైప్‌లైన్‌పైన పివిఎన్‌ఆర్   ఎక్స్‌ప్రెస్‌వే, రాజేంద్రనగర్ వద్ద భారీ నీటి లీకేజీని అరిక‌ట్ట‌డానికి గానూ, అత్తాపూర్ ముసీ   వంతెన వద్ద ఉన్న 300 ఎంఎం డ‌యా గల స్కవర్ వాల్వ్ ఎక్స్‌టెన్షన్ పైప్‌లో లీకేజీ   పనులు.. అలాగే, మైలార్దేవ్‌పల్లి ఫేజ్-III పంప్ హౌస్‌లో పని చేయని వాల్వ్‌లను   మార్చడం వంటి మరమ్మత్తు పనులను చేపట్టనున్నారు. ఈ ప‌నులు నేడు ( సోమవారం )  ఉద‌యం 11 గంటల నుండి మంగళవారం ఉదయం 7 గంటల వరకు 20 గంటల   పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 20 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 3 రింగ్ మెయిన్ – 1 కింద ఉన్న రిజర్వాయర్ల ప‌రిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.

       అంతరాయం ఏర్పడే ప్రాంతాలు :

   1. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 3- షేక్‌పేట్ రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాలు.

   2. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 6- జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా       రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాలు.

  3. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 15 – గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి    హిల్స్ రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాలు.

  నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని            పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page