హైదరాబాద్, నవంబర్ 15, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని కెనరా బ్యాంక్, అబ్బాయి టిఫెన్స్, సూరజ్ ఫాస్ట్ ఫుడ్, మలయాళం చర్చ్, లేబర్ ఆఫీసు,టెలిఫోన్ ఎక్సేంజి తదితర ప్రాంతాల్లో చేపట్టిన నూతన విడిసిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పర్యవేక్షించారు. స్థానికులు, ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రారంభించిన పనులను త్వరగతిన పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ పావని ఆదేశించారు. వీటితో పాటు డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న మరి కొన్ని రోడ్డు నిర్మాణం పనులను త్వరలో ప్రారంభిస్తామని, డివిజన్ వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లను ప్యాచ్ వర్క్‌ల ద్వారా అవసరం ఉన్న చోట నూతన రోడ్డు నిర్మాణం పనుల పై ప్రత్యేక దృష్టి వహించి అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని కార్పొరేటర్ పావని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు దామోదర్, శ్రీకాంత్, ఎం.ఉమేష్, సురేష్, రాజు, మహమూద్, సాయి కుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply