Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadచెత్త డంపింగ్ యార్డులు వెంటనే తొలగించాలి – ప్రభుత్వాలు మారిన సామాన్య ప్రజల సమస్యలు మారవా...

చెత్త డంపింగ్ యార్డులు వెంటనే తొలగించాలి – ప్రభుత్వాలు మారిన సామాన్య ప్రజల సమస్యలు మారవా ! – స్థానికులు

📰 Generate e-Paper Clip

చెత్త డంపింగ్ యార్డులు వెంటనే తొలగించాలి
ప్రభుత్వాలు మారిన సామాన్య ప్రజల సమస్యలు మారవా – స్థానిక ప్ర‌జ‌లు

హైదరాబాద్, ఆగ‌స్టు 30, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం కవాడిగూడ‌ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ బ్రిడ్జి ఏసీటీసీ ఎదురుగా చెత్తను నిర్లక్ష్యంగా డంప్ చేయడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడినప్పుడు చెత్తలో నుంచి మురుగు నీరు రావడం వల్ల పాదచారులు నడవడానికి ఇబ్బందిగా మారింది. అలాగే దోమల బెడద పెరిగి, స్థానికులు వైరల్ ఫీవర్, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు గానీ, రాంకీ సంస్థ గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓట్ల కోసం మాత్రమే కనిపించే స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకు కనిపించరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా మా కష్టాలు మాత్రం మారలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తీల మధ్యలో ఉన్న చెత్త డంపింగ్ యార్డులను వెంటనే తొలగించి మా ఆరోగ్యం, మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page