లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈఈ

కాప్రా, జూన్ 17, అద్దం న్యూస్ :   ల‌క్షా 20 వేల రూపాయ‌ల లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసి ఏఈఈ ఏసీబికి చిక్కింది. హైదరాబాద్–కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఒక కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనికి సంబంధించిన కొలతలను ఎం-బుక్ లో చేర్చేందుకు రూ.1,20,000 లంచం ఇవ్వాల‌ని ఏఈఈ బి.స్వ‌రూప డిమాండ్ చేసింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేసి, ఏఈఈ ని రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబి అధికారులు ప‌ట్టుకున్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page