Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadజవహర్‌న‌గ‌ర్ కమ్యూనిటీహాల్ పరిరక్షణకు జిహెచ్ఎంసి సిబ్బంది నియామకం – కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

జవహర్‌న‌గ‌ర్ కమ్యూనిటీహాల్ పరిరక్షణకు జిహెచ్ఎంసి సిబ్బంది నియామకం – కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్ ప‌రిర‌క్ష‌ణ‌కు జిహెచ్ఎంసికి చెందిన ఒక సిబ్బందిని నియ‌మించామ‌ని స్థానిక కార్పొరేట‌ర్ పావని విన‌య్ కుమార్ తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆమె జిహెచ్ఎంసి సిబ్బందితో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ మాట్లాడుతూ… జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో క‌ళ్యాణ‌మండ‌పం, వ్యాయామశాల‌, ఆట స్థ‌లం ఉన్నాయ‌న్నారు. చీక‌టి ప‌డిన వెంట‌నే కొంత మంది పోకిరీలు ఈ ప్రాంగ‌ణంలో చేరి జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్ వ‌ద్ద అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు. మ‌ద్యం సేవించి రాత్రంతా స్థానికుల ప్ర‌శాంత‌త‌కు భంగం క‌లిగిస్తున్నార‌ని, అనధికార వాహ‌నాల‌ను పార్కింగ్ చేస్తున్నార‌న్నారు. అందుకే జిహెచ్ఎంసి జోన‌ల్ క‌మిష‌న‌ర్ తో ప‌లుమార్లు చ‌ర్చించి క‌మ్యూనిటీహాల్ ప‌రిర‌క్ష‌ణ కోసం సిబ్బందిని నియ‌మించిన‌ట్టు తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా కమ్యూనిటీహాల్‌ను సమర్ధవంతంగా వియోగించుకోలేకపోతున్న సమస్యను కార్పొరేటర్ పావ‌ని ప్రత్యేక చొరవతో కమ్యూనిటీహాల్‌కు జిహెచ్ఎంసి సిబ్బంది నుండి ఇంచార్జీగా నియమించినందుకు స్థానికులు, కాలనీ వాసులు, కమిటీ సభ్యులు కార్పొరేట‌ర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి ఎస్ఎస్‌ గోవర్ధన్, ఎస్ఎఫ్ఎ శ్రీనివాస్, వెంకటేష్, జిహెచ్ఎంసి సిబ్బంది, కమ్యూనిటీహాల్ కమిటీ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు సాయి చంద్, మదన్మోహన్, సాయి కుమార్, ఆనంద్ రావు, రాజ్ కుమార్, ప్రశాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page