గడ్డం నవీన్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కార్మికులకు సన్మానం
ముషీరాబాద్, ఏప్రిల్ 15, అద్దం న్యూస్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బిఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బిజెపి మహంకాళి జిల్లా అంబేద్కర్ జయంతి ఉత్సవాల కో–కన్వీనర్ గడ్డం నవీన్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కార్మికులకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కార్మికులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు గడ్డం సతీష్, నరసింహ, గడ్డం బాలకృష్ణ, జైపాల్ రెడ్డి, కలకోట అరుణ్, జనార్ధన్, రాకేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply