హైదరాబాద్, నవంబర్ 16, అద్దం న్యూస్ : నగర ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం పరిశుభ్రమైన, హరిత వాతావరణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పలు సంస్థలతో కలిసి సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ వద్ద హ్యాపీ స్ట్రీట్స్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించింది. “ క్లీన్, గ్రీన్ హైదరాబాద్ ” అనే అంశంతో సాగిన ఈ కార్యక్రమంలో నగర పరిశుభ్రత, చెత్త నిర్వహణ, వ్యర్థాల విభజన, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. భవిష్యత్ పర్యావరణ పరిరక్షకులైన పిల్లల్లో అవగాహన పెంపు పై కార్యక్రమంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ జోన్ కమిషనర్ అనురాగ్ జయంతి హాజరై నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన వారితో “ స్వచ్ఛ్ సిటీ హీరోస్ ప్రమాణం ” చూపించారు. పిల్లలకు మొక్కలను పంపిణీ చేసి, హరిత హైదరాబాద్ నిర్మాణానికి తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply