ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డును పాఠ‌శాల విద్యాశాఖ‌లో విలీనం పై స్ప‌ష్ట‌త ఇవ్వండి

ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డును పాఠ‌శాల విద్యాశాఖ‌లో విలీనం పై స్ప‌ష్ట‌త ఇవ్వండి
– తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్‌ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్

హైదరాబాద్, మే 10, ( అద్దం న్యూస్ ) :   ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డును పాఠ‌శాల విద్యాశాఖ‌లో విలీనం పై స్ప‌ష్ట‌త ఇవ్వండి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్‌ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ( టిపిజెఎంఎ ) రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ కోరారు. హైద‌రాబాద్ సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో విలేక‌రుల స‌మావేశంలో గౌరీ స‌తీష్ మాట్లాడుతూ… 1971లో ఇంటర్‌ బోర్డును ఏర్పాటు చేశార‌ని… ఐదు దశాబ్దాలకు పైగా ఇంటర్‌ బోర్డు విద్యార్థులకు సేవలందిస్తుదన్నారు. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నదన్నారు. రాష్ట్రంలో 1460 జూనియర్ కళాశాలలో ఉన్నాయన్నారు. 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఇంటర్ చదువుకుంటున్నారని తెలిపారు. 2026- 27 గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పు తెస్తున్నామని అధికారులు చెప్పారన్నారు. కానీ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరము కూడా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగామాడడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

  2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియ‌ట్‌లో ఏ పాల‌సీని తీసుకొస్తున్నార‌నేది ప్ర‌జ‌ల‌కు బ‌హిర్గ‌తం చేయాల‌న్నారు. ఇంట‌ర్మీడియ‌ట్‌ బోర్డును పాఠ‌శాల విద్య‌శాఖ‌లో విలీనం చేస్తార‌ని తెలుస్తుంద‌ని, దాని పై విజ్ఞులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు, కాలేజీ యాజ‌మాన్యాల‌తో, విద్యావంతుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. ప్ర‌జా ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగే విధంగా కార్పొరేట్ విద్య‌ను క‌ట్ట‌డి చేయాల‌ని పేర్కొన్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి, గౌర‌వాధ్య‌క్షుడు వ‌ర‌దా రెడ్డి, అసిస్టెంట్ అధ్య‌క్షుడు వీరారెడ్డి, సంయుక్త కార్య‌ద‌ర్శి మ‌ల్లేష్‌, కుమార్‌, స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, హైద‌రాబాద్ జిల్లా అధ్య‌క్షులు శ్ర‌వ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page