కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్య‌క్షునిగా అవ‌కాశం క‌ల్పించండి – జిల్లా ఇన్‌చార్జ్ సిపి.జోషికి ద‌ర‌ఖాస్తు చేసిన పోచగారి నరేందర్

కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్య‌క్షునిగా అవ‌కాశం క‌ల్పించండి

– జిల్లా ఇన్‌చార్జ్ సిపి.జోషికి ద‌ర‌ఖాస్తు చేసిన పోచగారి నరేందర్


హైదరాబాద్, అక్టోబ‌ర్ 14, అద్దం న్యూస్ : 

కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్య‌క్షునిగా అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆ పార్టీ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం సీనియ‌ర్ నాయ‌కుడు పోచ‌గారి న‌రేంద‌ర్ కోరారు. మంగ‌ళ‌వారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని నియామక ప్రక్రియకు ఇన్‌చార్జ్‌గా ఏఐసిసి నాయకులు సిపి.జోషి, స‌హాయ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్యే ప‌ర్ణిక రెడ్డి లు హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్ష పదవి త‌న‌కు ఇవ్వాల‌ని పోచ‌గారి న‌రేంద‌ర్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా న‌రేంద‌ర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాలకు పైగా క్రీయాశీల‌క కార్య‌క‌ర్త‌గా ప‌ని చేస్తున్నాన‌ని తెలిపారు. వ‌చ్చిన ప్ర‌తి అసెంబ్లీ, పార్ల‌మెంట్, కార్పొరేట‌ర్ల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల గెలుపు కోసం ప‌ని చేశాన‌న్నారు.

త‌న‌కు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్ష ప‌ద‌వి ఇస్తే తాను క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల కార్య‌క‌ర్త‌లా పార్టీ బ‌లోపేతానికి మ‌రింత ప‌ని చేసే అవ‌కాశం త‌న‌కు దొరుకుతుంద‌న్నారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో గల మూడు జిల్లాల్లో ఏదైనా ఒకటి దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకునికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వవలసిందిగా సిపి జోషి ని కోరాన‌న్నారు. ఇందుకు సిపి జోషి కూడా సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగిందని న‌రేంద‌ర్ తెలిపారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page