Sunday, September 20, 2026
No menu items!
HomecinemaGolden Globes 2026: ‘అడాల్‌సెన్స్‌’కు అవార్డు

Golden Globes 2026: ‘అడాల్‌సెన్స్‌’కు అవార్డు

📰 Generate e-Paper Clip

Golden Globes 2026: ‘అడాల్‌సెన్స్‌’కు అవార్డు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో ‘అడాల్‌సెన్స్‌’ (Adolescence) వెబ్ సిరీస్ ప్రభంజనం సృష్టించింది. 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఈ సిరీస్ కీలక విభాగాల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

చరిత్ర సృష్టించిన ఓవెన్ కూపర్

ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు యువ నటుడు ఓవెన్ కూపర్. ‘అడాల్‌సెన్స్‌’లో తన అద్భుత నటనకు గాను ఆయన ‘ఉత్తమ సహాయ నటుడు’ (టీవీ సిరీస్) కేటగిరీలో అవార్డును గెలుచుకున్నారు. విశేషమేమిటంటే, అత్యంత పిన్న వయసులోనే గోల్డెన్ గ్లోబ్ అందుకున్న నటుడిగా ఓవెన్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. అవార్డు అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. “నా చుట్టూ ఉన్న గొప్ప నటీనటుల నుంచి నేర్చుకున్న పాఠాలే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి” అని ఉద్వేగానికి లోనయ్యారు.

మెరిసిన స్టీఫెన్ గ్రాహం

ఇదే సిరీస్‌లో లీడ్ రోల్ పోషించిన స్టీఫెన్ గ్రాహం తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని, ‘ఉత్తమ నటుడు’ (టీవీ సిరీస్) అవార్డును కైవసం చేసుకున్నారు. తండ్రీకొడుకుల భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

ప్రధాన విజేతల జాబితా

ఉత్తమ నటుడు (టీవీ సిరీస్‌) : స్టీఫెన్‌ గ్రాహం (అడాల్‌సెన్స్‌)

ఉత్తమ నటి : రోజీ బేర్నీ (ఇఫ్‌ ఐ హేడ్‌ లెగ్స్‌ ఐడిడ్‌ కిక్‌ యూ)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: పాల్‌ థామస్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆనథర్‌)

ఉత్తమ సహాయనటుడు (టీవీ సిరీస్‌): ఓవెన్‌ కూపర్‌ (అడాల్‌సెన్స్‌)

ఉత్తమ సహాయ నటుడు (సినిమా): స్టెలన్‌ (సెంటిమెంట్ వాల్యూ)

ఉత్తమ సహాయ నటి (సినిమా): టెయానా టేలర్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆనథర్‌)

గ్లోబల్ స్టేజ్‌పై ప్రియాంక చోప్రా సందడి

ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ వేడుకకు మరో ప్రత్యేకత తోడైంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ వేడుకకు వ్యాఖ్యాతగా (Host) వ్యవహరించి భారతీయులు గర్వపడేలా చేశారు. ప్రముఖ కామెడీ స్టార్ నిక్కీ గ్లేజర్‌తో కలిసి ఆమె ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నడిపించారు. వైవిధ్యమైన కథాంశాలతో వచ్చిన చిత్రాలు, సిరీస్‌లకు ఈ ఏడాది పెద్దపీట వేయడం గమనార్హం.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page