Friday, November 6, 2026
No menu items!
HomeGREATER HYDERABADప్రయాణికులకు శుభవార్త – కార్తీక మాసం సంద‌ర్భంగా అద్దె ప్రాతిప‌దిక‌న బ‌స్సుల ఏర్పాటు

ప్రయాణికులకు శుభవార్త – కార్తీక మాసం సంద‌ర్భంగా అద్దె ప్రాతిప‌దిక‌న బ‌స్సుల ఏర్పాటు

📰 Generate e-Paper Clip

ముషీరాబాద్‌, న‌వంబ‌ర్ 5, ( అద్దం న్యూస్ ) :

కార్తీక మాసాన్ని పుర‌స్క‌రించుకుని టిజిఎస్ ఆర్‌టిసి ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌ను ప్ర‌క‌టించింది. ఈ నెల 9వ తేదీ నుంచి అద్దె ప్రాతిపాదికన బస్సులు ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ జె.విజ‌య్ తెలిపారు. ప్రయాణికులు వివాహాది శుభకార్యాలకు, విహారయాత్రల కొరకు, కార్తీక మాసంలో వనభోజనాలకు, అయ్యప్ప భక్తులకు శబరిమల యాత్రకు వెళ్ల‌డం త‌దిత‌ర అవసరాలకు అనుగుణంగా అద్దెకు బస్సులు బుక్ చేసుకొని టీజీఎస్ ఆర్టిసి అందిస్తున్న సురక్షిత ప్రయాణాన్ని పొందే ఈ అవకాశాన్ని వినియోగించుకోగల‌ర‌ని కోరారు. పూర్తి వివరాలను పొందడానికి 9959226418, 9849450503, 9885423042 ఫోన్‌ నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాల‌ని కోరారు. 

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page