ఉస్మానియా ఆసుపత్రి, నవంబర్ 4, ( అద్దం న్యూస్ ) : ఇటీవల ప్రయాణికులతో జరిగిన వివాదంలో బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడి పది రోజుల నుంచి చికిత్స పొందుతున్న కండక్టర్ ప్రవళిక బుధవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రవళిక తల్లిని పరామర్శించి వారికి ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ఆర్టీసీ కుటుంబ సభ్యురాలు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఈ సంఘటనకు జరగగానే మేనేజ్‌మెంట్ తరఫున ఆసుపత్రికి కూడా వెళ్ళినమని, మంచి చికిత్స అందించే ప్రయత్నం చేసినాం కానీ దురదృష్టవశాత్తూ కండక్టర్ ప్రవళిక దూరమైందైన్నారు. ఆనాడు ప్రమాదం జరగగానే హాస్పిటల్ కి వెళ్ళి మంచి చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు కలుగజేస్తది, అదే సందర్భంలో కార్మికుల సంక్షేమము, భద్రత ముఖ్యమన్నారు. ఇటువంటి అంశాల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరినమన్నారు. ఈ సంఘటనలో దోషి హత్య ప్రయత్నం కింద ఉండి ఇప్పుడు హత్య కేసు నమోదు చేసి తగిన విధంగా కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగొద్దు, ఒకవేళ మా సిబ్బంది ఎక్కడైనా పొరపాటుగా ప్రవర్తించినారంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటామన్నారు. కానీ నేరుగా మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకొని తోసివేయడం వల్ల ఇవాళ ఒక కుటుంబం రోడ్డున పడ్డదన్నారు. ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకున్నా సభ్యురాలు కోల్పోయిన బాధను నుంచి ఎవరు తీసుకురాలేమన్నారు. మేము పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కార్మికుల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని పొన్నం తెలిపారు.
ఎక్కడ కూడా కార్మికుల లోపల అసహనం అనేది లేకుండా వారి పట్ల పెండింగ్‌లో ఉన్న అన్ని నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా ఉంటే ఎవరైనా పొరపాటున మా వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉంటే పిర్యాదు చేయవచ్చు చర్యలు తీసుకుంటాం.. ఇలాంటి దాడులు సరికాదని సూచించారు. చాలా క్రమశిక్షణ తోటి కాకీ బట్టల సంస్థగా ఆర్టీసి ముందుకు వస్తదన్నారు. క్రమశిక్షణకు మేము తప్పకుండా మా వాళ్ళను కూడా కోరుతాను, దయచేసి ప్రయాణికులే దేవుళ్ళు, కస్టమరే దేవుడు అన్నట్టుగా ప్రయాణికుల సౌకర్యం కలుగజేయడం మన బాధ్యత అని అన్నారు. ప్రయాణికుల ద్వారా కూడా ఏమైనా అసౌకర్యం కలిగితే మనం కూడా మనం చట్టం ముందు ఫిర్యాదు చేద్దామన్నారు. సంక్షేమ విషయంలో మా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రవళిక కుటుంబానికి ఆర్టీసీ అండగా ఉంటుంది :
ప్రవళిక కుటుంబానికి ఆర్టీసి అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు ,ప్రభుత్వం & ఆర్టీసీ నుండి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుండి కోటి రూపాయలు ప్రమాద భీమా అందనుందని తెలిపారు.






