వస్తు, సేవల పన్నుకు ( GST ) సంబంధించి ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలి
– సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ బ్యూరో, జులై 29, అద్దం న్యూస్ : వస్తు, సేవల పన్నుకు ( GST ) సంబంధించి ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ పరిధిలోని సంస్థలు సక్రమంగా పన్ను చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో చెల్లింపుదారులకు సంబంధించి అనుమానాలు, సందేహాల నివృత్తికి కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సెంటర్ నిర్వహణలో ఏఐను వినియోగించుకోవాలని సూచించారు. జీఎస్టీ, ఇతర పన్నుల విషయంలో పొరుగు రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేసి మేలైన విధానాలను స్వీకరించాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించేలా కార్యాలయాల్లో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply