Saturday, September 19, 2026
No menu items!
HomeEducationహెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ

హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ

📰 Generate e-Paper Clip

హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలో స్థిరపడాలని కలలు కనే భారతీయ టెక్కీలకు, ముఖ్యంగా గూగుల్ సంస్థలో పనిచేస్తున్న వారికి ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. హెచ్-1బీ (H-1B) వీసాపై ఉంటూ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న తమ విదేశీ ఉద్యోగుల కోసం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. టెక్ దిగ్గజం గూగుల్, వచ్చే ఏడాది (2026) నుండి తన ఉద్యోగుల కోసం గ్రీన్ కార్డు స్పాన్సర్‌షిప్ (PERM) ప్రక్రియను పునఃప్రారంభించి, వేగవంతం చేయాలని నిర్ణయించింది. గతంలో లేఆఫ్‌ల కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కనుండటం గమనార్హం.

అర్హత కలిగిన ఉద్యోగులకు సంబంధించి 2026లో PERM దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు గూగుల్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. PERMకు అర్హత సాధించిన ఉద్యోగులకు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గూగుల్‌ (Google) ఇమిగ్రేషన్‌ చట్ట సంస్థల నుంచి పిలుపు అందుతుందని కంపెనీ తమ ఇంటర్నల్‌ మెమోలో పేర్కొన్నట్లు సదరు కథనాలు తెలిపాయి. అయితే, ఈ ప్రణాళిక గురించి గూగుల్‌ బహింరగ ప్రకటనేదీ చేయలేదు.

ఏంటీ PERM ప్రక్రియ..?

అమెరికా ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డుల జారీ ప్రక్రియలో ‘ప్రోగ్రామ్‌ ఎలక్ట్రానిక్‌ రివ్యూ మేనేజ్‌మెంట్‌ (PERM)’ది కీలక పాత్ర. దీన్ని టెక్‌ కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తాయి. తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు శాశ్వత నివాసం దక్కేలా సాయం చేస్తుంటాయి. PERM ఆమోదం లభించిన తర్వాతే సదరు ఉద్యోగి తన గ్రీన్‌ కార్డు ప్రక్రియలో ముందుకెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. అయితే, ఇందుకు చాలా షరతులు ఉంటాయి. సంబంధిత విదేశీ ఉద్యోగికి నియమించుకోవడం వల్ల అమెరికా వర్కర్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన అమెరికన్లు అందుబాటులో లేరని రుజువు చేయాలి. దీనివల్లే చాలా కంపెనీలు లేఆఫ్‌లు లేదా నియామకాలు నెమ్మదించిన సమయంలో PERM దరఖాస్తులకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి.

లేఆఫ్‌లు ఎక్కువగా ఉన్న సమయంలో విదేశీ ఉద్యోగులకు PERM నిబంధనల ప్రకారం స్పాన్సర్‌షిప్‌ ఇవ్వడాన్ని సమర్థించుకోవడం కంపెనీలకు కష్టతరంగా మారుతుంది. 2023 జనవరిలో గూగుల్‌ ప్రపంచవ్యాప్తంగా 12వేలకు పైగా ఉద్యోగులను తొలగించింది. అదే సమయంలో PERM దరఖాస్తు ప్రక్రియను నిలిపివేసింది. ఆ ఏడాది అమెజాన్‌, మెటా వంటి సంస్థలు కూడా ఇదే విధంగా వ్యవహరించాయి. గత ఏడాది కాలంలో గూగుల్‌ చాలా స్వల్ప సంఖ్యలో PERM దరఖాస్తులను ఫైల్ చేసింది. అయితే, 2026 నుంచి ఈ ప్రోగ్రామ్‌ను వేగవంతం చేయాలని గూగుల్‌ భావిస్తోంది.

అర్హత ఎలా..?

అయితే, గూగుల్‌లో పనిచేసే ప్రతి విదేశీ ఉద్యోగి ఈ PERMకు అర్హత సాధించలేరు. ఇందుకు కంపెనీ కొన్ని షరతులు విధించింది. డిగ్రీతో పాటు పని అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక, గూగుల్‌ ఆఫీసులకు వచ్చి పనిచేసే ఉద్యోగులకే ఈ ప్రోగ్రామ్‌ వర్తిస్తుంది. రిమోట్‌గా ఉండి పనిచేసే వారిని PERM అర్హతకు పరిగణించాలంటే వారు కచ్చితంగా తమ నివాస ప్రదేశాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సీనియార్టీ, పనితీరు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుందని గూగుల్‌ తమ మెమోలో పేర్కొన్నట్లు సమాచారం.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page