Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు, బీసీ సంక్షేమ సంఘం...

ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుఆర్‌.కృష్ణయ్య

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి

– రాజ్య‌స‌భ స‌భ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుఆర్‌.కృష్ణయ్య

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి ప్రభుత్వ భూములను అమ్మకూడదని రాజ్య‌స‌భ స‌భ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుఆర్‌.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను వేలం వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీలపల్లి అంజి, నీల వెంకటేష్ అధ్యక్షతన హాస్టల్ విద్యార్థులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ… హాస్టల్లో నిర్వాహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తులు వీటిని ప్రజా అవసరాలకు పేదల ఇండ్లు కట్టడానికి ప్రభుత్వ ఆఫీసులకు హాస్టళ్లకు స్కూళ్లకు నిర్మాణానికి ఉపయోగించాలి అంతేగాని అమ్ముకోవడానికి కాదని ఇప్పుడు అమ్మితే భావితరాలకు ఏమి ఉండదని అన్నారు. అమ్మడాన్ని ఆపేసి ప్రభుత్వ స్థలాలలో గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. మన రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 295 హాస్టలు, 320 బీసీ గురుకులాలకు ఒక్క హాస్టల్ కి కూడా సొంత భవనం లేదన్నారు. అద్దె భవనాలకు మూడు సంవత్సరాలుగా హత్యలు చెల్లించకపోవడంతో ఖాళీ చేయమని యజమాన్యం ఒత్తిడి చేస్తున్నారని అన్నారు.

విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్స్ 4000 కోట్లు తక్షణమే చెల్లించాలని కోరారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేయరాదని ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం అవుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి విద్యార్థులకు అన్ని వస్తువులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు సొంత భవనాలు నిర్మించాలని ఆలోచన ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు దీని మూలంగా మానవ వనరులను తీర్చిదిద్దవలసిన హాస్టల్లు గురుకులాలు సౌకర్యాలు లేక జ్ఞాన వికాసం పొందలేకపోతున్నాయని ఇది సమాజానికి తీవ్ర నష్టమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అనంతయ్య, మల్లేష్ యాదవ్, రవి కుమార్ యాదవ్, మణికంఠ, నిఖిల్, ఆశిష్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page