Friday, September 18, 2026
HomeHyderabadఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలి – ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు...

ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలి – ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్ మాదిగ

ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలి

– ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్ మాదిగ

హైదరాబాద్, జులై 26, అద్దం న్యూస్ :    ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల దోపిడిని ప్రభుత్వం అరికట్టే చర్యలు తీసుకోవాలని ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్‌ చేస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి పేర్కొన్నారు కానీ.. యధావిధిగా కళాశాలలో వేలకోట్ల దందా కొనసాగుతూనే ఉందన్నారు. కళాశాలపై ఐటి, ఈడి దాడులు నిర్వహించి డొనేషన్ల దోపిడిని అరికట్టాలన్నారు. తల్లి దండ్రులకు ప్రభుత్వం వారి బాధలను అర్థం చేసుకొని రాష్ట్రంలో అన్ని ఇంజనీరింగ్ కళాశాలకు ఒకే తరహా ప్రమాణాలు ఒకే తరహా ఫీజు విధానం అమలు చేయాలని రమేష్ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల పై భారం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇంజనీరింగ్ కాలేజీలపై సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page