పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దు
డిప్లమాను ఐటిఐలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని జీవో నెంబర్ 97ను రద్దు చేయాలి
♦ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 17, ( అద్దం న్యూస్ ) : పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని, డిప్లమాను ఐటిఐలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ముందు విద్యార్థులతో కలిసి సోమవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU ) పేరిట శక్తి పాలసీని తీసుకువచ్చి డిప్లమా కోర్సులను ఐటిఐ ఏటీసీలతో అనుసంధానం చేయడం సరికాదని అన్నారు. అదే విధంగా విద్యారంగంన్నీ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ పేరుతో SBTET ను తొలగించే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానంతో పాలిటెక్నిక్ విద్యార్థులను కార్మికులుగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 97 ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చేలగాటమాడటం బాధాకరమని అన్నారు. పాలిటెక్నిక్ కోర్సులను ఇంజనీరింగ్ కోర్సులుగా అప్‌గ్రేడ్ చేయాల్సింది పోయి డి గ్రేడ్ చేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) హైదరాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తు పోరాటాలకు సన్నదమవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్, ఉపాధ్యక్షుడు నాగేందర్, ప్రవీణ్, అరవింద్, భరత్, కార్తీక్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply