Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaగవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ కరపత్రంలాగా ఉంది     ...

గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ కరపత్రంలాగా ఉంది     – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ కరపత్రంలాగా ఉందని సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు పి.సాయిబాబా అన్నారు. అమలు కాని హామీలను అబద్ధ ప్రచారాలతో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన అన్ని వాగ్దానాలను పూర్తి చేశామంటూ గవర్నర్ ప్రసంగంలో వివరించారని, ఇచ్చిన ఆరు హామీల సంగతి దేవుడెరుగు ? ప్రజలకు కనీస సౌకర్యాలను కూడా కల్పించడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సాయిబాబా విమ‌ర్శించారు. న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… వేసవి కాలం సందర్బంగా అప్రకటిత విద్యుత్ కోతలు. మంచినీటి ఎద్దడి, రేపు రాబోయే కాలంలో మంచినీటి తీవ్రమైన కొరత ఏర్పడే పరిస్థితి ఉందని అన్నారు. ఇచ్చిన ఆరు హామీలకు అతీగతీలేద‌ని, రైతు రుణమాఫీ చేశామంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వం, రైతుల రుణమాఫీ పట్ల ఏఒక్క రైతు కూడా సంతృప్తిగా లేద‌న్నారు. ఎంతమందికి ఇచ్చారో ? ఎంత మొత్తంలో రుణమాఫీ చేశారో ? శ్వేతపత్రం విడుదల చేయాలని సాయిబాబా డిమాండ్ చేసారు.

అంతేగాక కొత్తగా చేనేత రుణమాఫీ అంటూ ఊదర గొడుతున్నారని, ఇప్పటికీ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి మాఫీ కూడా జరగలేదని అన్నారు. కేవలం ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడుపు కుంటున్నారని ధ్వ‌జ‌మెత్తారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, దాంట్లో గవర్నర్‌ను కూడా భాగస్వామ్యం చేయడం నిజంగా విచారకరమ‌న్నారు. గవర్నర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లాగా మాట్లాడటం మనసును కలచి వేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరకాలం పైగా గడుస్తున్నా జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. కొత్తగా 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని మరొకసారి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ఎన్నో సమస్యలతో రాష్ట్రం అతలాకుతులమవుతుంటే మా పాలన దేశానికే ఆదర్శమంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు. “గురువింద గింజ తన కింద నలుపెరుగదన్న” చందంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అదే విధంగా కులగణన సర్వే అన్నీ తప్పులతడకగా ఉంటే ప్రజలే తిరస్కరించారని, తిరిగి మళ్లీ చేపట్టినా ఫలితం లేదన్నారు. కాబట్టి నిజంగా మీకు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇంత కాలం కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు వెంటనే ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, తడక వినోద్ తదితరులు పాల్గొన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page