హైదరాబాద్, జూన్ 6, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మండప పునఃపూజలు, కళా హోమాలు, స్పర్శ హోమాలు, అంగ హోమాలు, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, గోదృష్టి, నేత్రోన్మేలనం, మహాకుంభం, అమ్మవారి దర్శనం, మండప ఉద్వాసన, వేదా శీర్వచనం తదితర పూజలు జరిగాయి. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి నగర గ్రంథాలయం సంస్థ ఛైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, కార్యదర్శి పద్మజ లు హాజరై పూజలు చేశారు. హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పద్మజ, ఉద్యోగస్తులు, విశ్రాంతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, గ్రంథాల సిబ్బంది పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply