Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADమూడు భాగాలుగా గ్రేటర్ హైదరాబాద్

మూడు భాగాలుగా గ్రేటర్ హైదరాబాద్

📰 Generate e-Paper Clip

మూడు భాగాలుగా గ్రేటర్ హైదరాబాద్
కొత్తగా మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు
• జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజన 
• మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా జయేశ్ రంజన్
• జిహెచ్ఎంసి కమిషనర్‌గా కర్ణన్
• సైబరాబాద్ కమిషనర్‌గా సృజన
• మల్కాజిగిరి కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 11, అద్దం న్యూస్ :      తెలంగాణ క్యూర్ ( టిసియుఆర్ ) పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ( జీహెచ్ఎంసి ) ని పునర్వ్యవస్థీకరణలో భాగంగా జీహెచ్ఎంసి, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేష‌న్ ( సిఎంసి ), మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేష‌న్ ( ఎంఎంసి ) లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, సంక్షేమంతో పాటు సమస్యలను వేగంగా పరిష్కరించే ఉద్దేశ్యంతో జీహెచ్ఎంసిని వికేంద్రీ కృతం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రత్యేకాధికారిగా జయేష్ రంజన్ :

టిక్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసి, సిఎంసి, ఎంఎంసిలకు ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు బుధవారం ఆయన జీహెచ్ఎంసి ప్రధాన కార్యా లయంలో స్పెషల్ ఆఫీస‌ర్‌గా బాధ్యతలను స్వీకరించారు. జీహెచ్ఎంసి కమిషనర్ కర్జన్ ఆయనకు స్వాగతం పలికారు.

కమిషనర్లుగా బాధ్యతల స్వీకరణ :

జీహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్‌వి.కర్ణన్, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేష‌న్ కమిషనర్‌గా సృజన, మల్కాజిగిరి మునిసిపల్ కమిషనర్‌గా వినయ్ క్రిష్ణారెడ్డిలు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

జీహెచ్ఎంసి, సిఎంసి, ఎంఎంసి :

ఓఆర్ఆర్ వరకు విస్తరించిన జీహెచ్ఎంసీలో 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా ఉండగా పునర్వ్యవస్థీకరణలో భాగంగా 6 జోన్లు సికింద్రాబాద్ జోన్ ( సర్కిళ్లు, కవాడిగూడ, ముషీరాబాద్, అంబ‌ర్‌పేట్‌, మెట్టుగూడ, తార్నాక ), ఖైరతాబాద్ జోన్ ( సర్కిళ్ళు : ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్‌గూడ‌, అమీర్‌పేట్‌ ), గోల్కొండ జోన్ ( సర్కిళ్లు : గోషామహాల్, మెహిదీపట్నం, కార్వాన్, గోల్కొండ, మాసాబ్ ట్యాంక్ ), రాజేంద్రనగర్ జోన్ ( సర్కిళ్ళు : రాజేంద్రనగర్, అత్తాపూర్, బహదూర్ పురా, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, జంగ మ్మెట్టు) శంషాబాద్ జోన్ ( ఆదిభట్ల, బడంగ్‌పేట్‌, జలపల్లి, శంషాబాద్ సర్కిళ్ళు, చార్మినార్ జోన్ ( సర్కిళ్ళు: సంతోష్ నగర్, మలక్‌పేట్‌, యాకుత్‌పురా, చార్మినార్, మూసారాంబాగ్ ) లలో 30 సర్కి ళ్ళు 150 వార్డులతో జీహెచ్ఎంసి ఏర్పాటు చేశా రు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్నే 16 స ర్కిళ్ళు, 76 వార్డులు 3 జోన్లు శేరిలింగంపల్లి జో న్ ( సర్కిళ్ళు: శేరిలింగంపల్లి, నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, మియాపూర్ ), కూక‌ట్‌ప‌ల్లి జోన్ ( సర్కిళ్ళు : కూకట్‌ప‌ల్లి, మాదాపూర్, ఆల్విన్ కాలనీ, మూసాపేట్ ), కుత్బుల్లాపూర్ జోన్ ( సర్కిళ్ళు: జీడిమెట్ల, చింతల్, గాజుల రామారం, కొంపల్లి, ని జాంపేట్, దుండిగల్, మేడ్చెల్ ) లతో కలిపి ఏర్పా టు చేశారు. 74 వార్డులు, 14 సర్కిళ్ళు, 3 జోన్లు మల్కాజిగిరి జోన్లో ( సర్కిళ్ళు అల్వాల్, బోయిన్‌ప‌ల్లి, కీసర, మౌలాలీ, మల్కాజిగిరి ), ఉప్పల్ జోన్ ( సర్కిళ్ళు: ఉప్పల్, ఘట్‌కేస‌ర్‌, బోడుప్పల్, నాచారం, కాప్రా ), ఎల్బీనగర్ ( సర్కిళ్ళు : సరూర్‌న‌గ‌ర్‌, ఎల్బీనగర్, హయత్‌న‌గ‌ర్, నాగోల్ ) ఉన్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page