Saturday, September 19, 2026
No menu items!
Homeculturalsఈ నెల 16న ఖ‌మ్మంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తెలంగాణ రెండ‌వ రాష్ట్ర మ‌హాస‌భ‌లు

ఈ నెల 16న ఖ‌మ్మంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తెలంగాణ రెండ‌వ రాష్ట్ర మ‌హాస‌భ‌లు

📰 Generate e-Paper Clip

ఈ నెల 16న ఖ‌మ్మంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తెలంగాణ రెండ‌వ రాష్ట్ర మ‌హాస‌భ‌లు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 8, ( అద్దం న్యూస్ ) :   సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తెలంగాణ రెండవ రాష్ట్ర మహాసభలను ఈ నెల 16వ తేదీన ఖమ్మం వేదిక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. “ ప్రజాస్వామ్యం – సాంస్కృతిక సంభాషణ ” అనే అంశంపై ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మహాసభల సందర్భంగా గోడ ప‌త్రిక‌ విడుదల కార్యక్రమం బాగ్‌లింగంప‌ల్లి హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం టిపిఎస్‌కె హాల్‌లో శ‌నివారం జ‌రిగింది. ఈ సందర్భంగా పరిశోధకులు, సాహిత్య విమర్శకులు డాక్ట‌ర్‌.సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్య విలువలు, లౌకికత, సమానత్వం, సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షించడంలో రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని భిన్న కులాలు, మతాలు, జాతుల మధ్య సామరస్యపూరిత సహజీవన సంస్కృతిని పెంపొందించే సాహిత్య, సాంస్కృతిక నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో హాజరవుతార‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, సమూహ కన్వీనర్ భూపతి వెంకటేశ్వర్లు, డాక్టర్ రాపోలు సుదర్శన్, కల్యాణి కుంజ, రచయిత్రి రూప రుక్మిణీ, సమూహ కన్వీనర్ ఎకె.ప్రభాకర్, జగదీశ్వర రావు, ఎం.శ్యామల త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page