12 న హనుమాన్ జన్మోత్సవ్ బైక్ ర్యాలీ

 

హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ :    హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా భజరంగ్ సేన ఆధ్వర్యంలో ఈ నెల 12 వ తేదీన హనుమాన్ వ్యాయామశాల నుంచి తాడ్బన్ హనుమాన్ మందిర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్.లక్ష్మణ్ రావు తెలిపారు. బుధవారం కాచిగూడ లోని భజరంగ్ సేన రాష్ట్ర కార్యాలయంలో ఆయన శ్రీ వీర్ హనుమాన్ విజయ్ యాత్ర బైక్ ర్యాలీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ఈ నెల 12వ తేదీన ఉదయం పది గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని, ర్యాలీ అనంతరం మాహా హారతి ఉంటుందని తెలిపారు. హనుమాన్ జన్మోత్సవాన్ని భక్తిశ్రద్దలతో, ఐక్యతతో జరుపుకునే ఈ మహత్తర కార్యక్రమంలో భక్తులు, హిందూ బంధూవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ సేన హైదరాబాద్ నగర అధ్యక్షుడు మనోజ్ మొగల్గిద్ది, నగర మహిళా అధ్యక్షురాలు దుర్గాశర్మ, రాఘవ, నరేష్, అశ్విన్, రామేశ్వర్ మిశ్రా, ప్రవీణ్ యాదవ్, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page