Friday, September 18, 2026
Homedevotionalరాంనగర్‌లో ఘనంగా హనుమాన్ శోభా యాత్ర 

రాంనగర్‌లో ఘనంగా హనుమాన్ శోభా యాత్ర 

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :నుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ లో ఘనంగా జరిగింది. శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి గడ్డం నవీన్ అధ్యక్షతన అడిక్‌మెట్‌ అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి రాంనగర్ చౌరస్తా, దయారా మార్కెట్ మీదుగా హరినగర్ వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా అడుగడుగునా స్వాగత తోరణాలను ఏర్పాటు చేసి నీళ్లు, మజ్జిగ, పులిహోర పంపిణీ చేశారు. రాంనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి రాముని ప్రతిమ అందర్నీ ఆకట్టుకుంది. దయారా మార్కెట్ వద్ద హిందూ, ముస్లిం భాయి భాయి అంటూ పీస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక పైకి సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, అడిషనల్ డీసీపీ ఆనంద్, చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ముషీరాబాద్ సిఐ రాంబాబు ప్రత్యేక పూజలు చేశారు. వారిని హనుమాన్ ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దోమలగూడ సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలతోపాటు వందల మంది పోలీసులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page