కరాటేతో ఆత్మ‌స్థైర్యం పెరుగుతుంది – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

 

హైదరాబాద్, ఏప్రిల్ 13, అద్దం న్యూస్  కరాటేతో ఆత్మ‌స్థైర్యం పెరుగుతుందని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో గోల్డెన్ డ్రాగన్ కరాటే అకాడమీ ఆధ్వ‌ర్యంలో ఫ్లయింగ్ కిక్ శిక్షణలో ప్రావీణ్యం చెందిన విద్యార్థులకు “కిడ్ హుడ్ ఇంటర్నేషనల్ స్కూల్” లో కరాటే శిక్షణలో గ్రేడ్‌ను సంపాదించిన విద్యార్థులకు గ్రేడింగ్ బెల్ట్‌ల‌ను, ప్రశంసా ధృవీకరణ పత్రాలను ( సర్టిఫికెట్లు) బహుకర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కిడ్స్ స్కూల్ ఛైర్మ‌న్‌ మనోజ్ కొఠారి, కరాటే అకాడమీ ఫౌండర్ విక్కీ మాస్టర్ ఆహ్వానం మేరకు ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ పావ‌ని, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ… ఆత్మ రక్షణ, ధైర్యం, శారీరక ఎదుగుదలకు, స్కూల్‌లో నేర్పించే పాఠాలతో పాటు విద్యార్ధుల్లోని ఆసక్తిని గమనించి వారికి తగిన క్రీడల్లో తల్లిదండ్రులు విద్యార్థులకు శిక్షణను, ఇప్పించి మంచి భవిష్యత్తును అందించాలని కార్పొరేటర్ పావ‌ని అన్నారు. పిల్లలకు కరాటేలో మంచి శిక్షణను అందిస్తున్న గోల్డెన్ డ్రాగన్ కరాటే అకాడమీ వారినీ, ప్రోత్సహిస్తున్న కిడ్ హుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. గ్రేడింగ్ బెల్ట్ పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్య‌క్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నేత శ్రీకాంత్, ఆనంద్ రావు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బ‌హుమ‌తుల‌ను అంద‌చేస్తున్న కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page