గాంధీనగర్ కార్పొరేటర్‌గా డివిజన్‌ను అభివృద్ధి చేసిన ఎ.పావనికి ఆత్మీయ సన్మానం
హైదరాబాద్, ఫిబ్రవరి 18, అద్దం న్యూస్ : ప్రజల అభ్యున్నతి, డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా అలుపెరుగని కృషి చేసిన గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌ను ఎస్ఆర్‌టి కాలనీ వాసులు బుధవారం ఘనంగా సన్మానించారు. గడిచిన 5 ఏళ్ల జిహెచ్ఎంసి కార్పొరేటర్ పదవీ కాలంలో అసాధ్యం అనుకున్న అనేక అభివృద్ధి పనులను కార్పొరేటర్‌గా సుసాధ్యం చేశారని, గెలిచిన తొలి దశలో, ప్రపంచ దేశాలను సైతం వణికించిన కరోనా వ్యాధి పట్ల డివిజన్ ప్రజల ఆరోగ్య క్షేమం కొరకు ఉచిత 100 పడకల కరోనా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి వ్యాధిగ్రస్తులకు కొవిడ్ వ్యాక్సిన్‌తో పాటు అన్ని వసతులను ఏర్పాటు చేసిన పావని వినయ్ కుమార్ ధైర్యంగా ముందుకు నడిచారని కాలనీవాసులు పేర్కొన్నారు. డివిజన్‌లోని నూతన మంచినీరు,సేవరేజి పైప్‌లైన్ ఏర్పాటు, నూతన రోడ్లు, పార్క్‌ల సుందరీకరణ, కమ్యూనిటీహళ్ల అభివృద్ధి, ఇళ్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయించడంలో తనదైన శైలితో చేసిన పోరాటాలలో ఎదురులేని విజయాలను సొంతం చేసుకున్నారని పలువురు కార్పొరేటర్ పట్ల తమ కృతజ్ఞతను తెలియచేశారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పావని మాట్లాడుతూ… డివిజన్ అభివృద్ధిలో ప్రజలకు 5 ఏళ్లుగా తాము చేసిన సేవను ఆశీర్వదించి, అమూల్యమైన అవకాశాన్ని కల్పించి, సహకరించిన ప్రజలకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియచేశారు. కార్పొరేటర్‌గా కోట్ల రూపాయలను మంజూరు చేయించానని, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి నిధులు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ సహకారం, జిహెచ్ఎంసి ఫండ్స్‌తో డివిజన్‌ను అభివృద్ధి చేశానన్నారు. తమ శ్రమను గుర్తించి,అపార అభిమానంతో చేసిన ఈ ఆత్మీయ సన్మానం ప్రజా సేవకు మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందని అందుకు ప్రతి ఒక్కరికీ పేరు..పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కార్పొరేటర్ పావని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జి.శ్రీనివాస్ యాదవ్, కడియం రాము, సంజీవ, శివ కుమార్, ప్రశాంత్, భారత్, జ్ఞానేశ్వర్, యాదగిరి, ఎస్ఆర్‌టి కాలనీ వాసులు, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్ రావు, సీనియర్ నేతలు శ్రీకాంత్, దామోదర్, పాల శ్రీనివాస్, ఎం.ఉమేష్, మహమూద్, హనుమత్, కుమార్, నీరజ్, అరుణ్ కుమార్, సాయి సంతోష్, రాజ్ కుమార్, రహమత్ అలి, శశికాంత్, లావణ్య, లక్ష్మి, సంధ్యా రాణి, సంయుక్త రాణి, పూర్ణ, అనూష తదితరులు పాల్గొన్నారు.![]()

![]()

