హైదరాబాద్‌లో భారీ వర్షం.. వరదలో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు
ఆసిఫ్‌నగర్ – హబీబ్‌నగర్‌లో వరదలో కొట్టుకుపోయిన మామ, అల్లుడు
ముషీరాబాద్ వినోభానగర్‌లో నాలాలో పడి కొట్టుకుపోయిన యువకుడు

హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 14, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. నగరంలోని ముషీరాబాద్, మెట్టుగూడ, ఉస్మానియా యూనివర్శిటీ, షేక్‌పేట్, అడిక్‌మెట్, కాప్రా, చిలకలగూడ, హిమాయత్‌నగర్, నేరెడ్‌మెట్, గచ్చిబౌలి, ఉప్పల్, అల్వాల్, మల్లాపూర్, నాంపల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ భారీ వర్షం ధాటికి ఆసిఫ్‌నగర్ హబీబ్‌నగర్ అఫ్జల్‌సాగర్‌లోని మంగారు బస్తీలో ఇద్దరు గల్లంతయ్యారు. అఫ్జల్‌సాగర్ నాలా దాటుతుండగా మామ, అల్లుడు అయిన అర్జున్ ( 25 ), రాము ( 26 ) లు నాలాలో గల్లంతు అయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ముషీరాబాద్‌లోని వినోభానగర్ బస్తీలో సన్ని ( 24 ) అనే యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాను ఆనుకొని ఉన్న గొడ పై స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో తన ద్విచక్ర వాహనం వరద నీటిలో కొట్టుకుతుండడాన్ని చూసి సన్ని దానిని పట్టుకునే ప్రయత్నంలో ఆ నీటి ధాటికి కొట్టుకుపోయాడని స్థానికులు చెబుతున్నారు. వెంటనే పోలీసులు, డిఆర్ఎఫ్, హైడ్రా, జిహెచ్ఎంసి అధికారులు రంగంలోకి దిగి సన్ని గాలింపు చర్యలు చేపట్టారు. అటు గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇంకా ఎంత మంది చనిపోవాలి – అంతా జిహెచ్ఎంసి అధికారులే తప్పు
– అధికారులను నిలదీసిన వినోభానగర్ బస్తీవాసులు

నగరంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ వినోభానగర్ బస్తీలో సన్ని అనే యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలసుకున్న స్థానిక బస్తీవాసులు జార్జ్, బిఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహా, గొర్ల నాగులు తదితరులు ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే సన్ని కోసం గాలింపు చర్యలు చేపడుతున్న జిహెచ్ఎంసి అధికారులతో బిఆర్ఎస్ నాయకుడు నాగులు వాగ్వాదం చేశాడు.ఇంకా ఎంత మంది వరద నీటిలో కొట్టుకుపోయి చనిపోవాలని నిలదీశారు. జిహెచ్ఎంసి అధికారులదే తప్పంతా అని అన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply