Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalహిందూ సమ్మేళనానికి భారీగా హాజరైన హిందూ బంధువులు

హిందూ సమ్మేళనానికి భారీగా హాజరైన హిందూ బంధువులు

📰 Generate e-Paper Clip

హిందూ సమ్మేళనానికి భారీగా హాజరైన హిందూ బంధువులు

హైద‌రాబాద్‌, మే 24, ( అద్దం న్యూస్ ) :   హిందూ సమ్మేళన నిర్వహన సమితి ఆధ్వర్యం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ లోని ఆంధ్రాకేఫ్ చౌరస్తా వద్ద హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. శ‌నివారం రాత్రి జ‌రిగిన ఈ సమ్మేళనానికి ముఖ్య తిథులుగా శ్రీ శ్రీ శ్రీ స్వామి శాంతానంద సరస్వతి, ప్రధాన వక్తలుగా సమాచార భారతి కోశాధికారి పులిగడ్డ రాఘవేంద్ర, అత్యధిక ప్రవచన కర్త కొముది వేదాంతం హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… హిందువుల ఐక్యతను ప్రభావితం చేసి, వాడ వాడలా, గడప గడపకు హిందూ సంస్కృతి, సంప్రదాయాలను చేర‌వేయాల‌న్నారు. మన భారత దేశం పట్ల గౌరవాభిమానం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకిత భావం, సేవాగుణం వంటి వాటిని వికసింప చేసేందుకు, హిందులందరి భాగసౌమ్యాన్ని కోరాల‌న్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, రామకృష్ణ శాస్త్రి, వెంకటరమణ, డాక్ట‌ర్‌.చంద్రశేఖర్, బిజెపి డివిజన్ అధ్యక్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, రాజు, పాల శ్రీనివాస్, ఎం.ఉమేష్, శ్రీనివాస్ రావు, అరుణ్ కుమార్, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, సంతోష్, సంపత్ యాదవ్, సంయుక్త రాణి, సోమిషెట్టి శ్రీనివాస్, రాధాకృష్ణ, సత్యనారాయణ, హిందు బంధువులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధులు, బిజెపి నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page