Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaన‌గ‌రంలో ఘ‌నంగా హోలి సంబురాలు

న‌గ‌రంలో ఘ‌నంగా హోలి సంబురాలు

📰 Generate e-Paper Clip

న‌గ‌రంలో ఘ‌నంగా హోలి సంబురాలు

రంగులు చ‌ల్లుకున్న చిన్నారులు

ఇందిరాపార్క్‌లో జ‌రిగిన హోలి సంబ‌రాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

 

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : హోలి సంబురాలు రాష్ట్రంతో పాటు హైద‌రాబాద్ న‌గ‌రంలో వాడ వాడ‌లా ఘ‌నంగా జ‌రిగాయి. హోలి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని గురువారం రాత్రి కాముని ద‌హ‌నం చేశారు.స్నేహితులు, చిన్నారులు, చిన్నా పెద్దా తేడా లేకుండా రంగులు చ‌ల్లుకున్నారు. హోలి పాట‌ల‌కు అనుగుణంగా నృత్యాలు చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఇందిరాపార్క్‌లో హోలి సంబురాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఇందిరాపార్క్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ పండుగ సంబరాలకు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ పాల్గొన్నారు. వాక‌ర్ల‌తో హోలి ఆడారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ… హోలీ అందరి జీవితాలను రంగులతో నింపాలన్నారు. హోలీ కష్టాలన్నీ తొలగించాలని జీవితం ఆనందమే కావాలని కోరుకుంటున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ప్రభాకర్ యాదవ్, నరేందర్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, స‌ర‌స్వ‌తి పుత్రులు దైవ‌జ్ఞ‌శ‌ర్మ‌,  ఆర్‌కె.శ్రీనివాస్ ముదిరాజ్‌,పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page