ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు సన్మానం
హైదరాబాద్, జనవరి 3, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ మణెమ్మ గల్లీలో దీర్ఘకాలికంగా ఉన్న రోడ్డు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఆ బస్తీవాసులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… ఎన్నో ఏళ్ల నుంచి మణెమ్మ బస్తీలో రోడ్డు సమస్య ఉందని, అనేక రకాలుగా లీగల్ సమస్య ఉన్నప్పటికి వాటిన్నంటిని అధిగమించి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేను సన్మానించిన వారిలో మణెమ్మ గల్లీ అధ్యక్షుడు మోహన్, ధర్మ, సతీష్, సత్యనారాయణ, గణేష్, శ్రీనివాస్, జహిరుద్దీన్, శివ, లక్ష్మీ, సంధ్య, నళిని, శారద, విశాలి, హిరామణి, యాదగిరి తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జైసింహా, మీడియా ఇన్‌చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, బిఆర్ఎస్ అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సురేందర్, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు యూనుస్, అబ్బు, చిట్టి శ్యామ్ సుందర్, మేడి సత్యనారాయణ, జెళ్ల బిక్షపతి, బొట్టు శ్రీనివాస్, హరీష్, మాధవ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.















Leave a Reply