వేమూరి అనంతరామకృష్ణశర్మకు గౌరవ డాక్టరేట్

వేమూరి అనంత రామకృష్ణ శర్మకు గౌరవ డాక్టరేట్

అనంత రామకృష్ణ శర్మను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యునివర్సిటీ

మైసూరు, ఏప్రిల్ 2 ( అద్దం న్యూస్ ) :   అనంతశ్రీ కలం పేరుతో ఎంతో పేరొందిన‌ ప్రముఖ కవి వేమూరి అనంత రామకృష్ణ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. సాహి త్యరంగంలో ఆయన చేసిన సేవలకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. నగరానికి చెందిన వేమూరి అనంత రామకృష్ణశర్మకు తమిళనాడులోని మైసూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు పలువురు ప్రముఖులు, యూనివర్సిటీ ప్రతినిధుల చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణశర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు… చిన్నతనం నుంచే రచనలపై ఎంతో ఆసక్తి కన బరిచి ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందినట్లు తెలిపారు. గత 15 సం వత్సరాలుగా సాహితీ రంగంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు గాను గౌరవ డా క్టరేట్ ప్రదానం చేసినట్లు తెలిపారు. ఇటీవల తాను రచించిన అనంత కవితాలహరి వచన కవిత్వం మంచి గుర్తింపు పొందినట్లు వివరించా రు. ఇంగ్లీష్ కవితలో పోయేటిక్ కలె క్షన్స్ ఆఫ్ అనంతశ్రీ, హిందీలో అనంతశ్రీకి షాయరీ, తెలుగులో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పుస్తకాలు త్వరలో ఆవిష్కరించినట్లు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రచనలు చేసినందుకు ఏసియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ గుర్తించి సాహిత్య రంగంలో గౌరవ డాక్టరేట్ బహుకరించడం ఎంతో ప్రోత్సాహంతో పాటు మరింత బాధ్యత పెరిగిందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు సాంస్కృతిక, సామాజిక సేవలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణశర్మకు పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page