భారతదేశ భూ వనరుల విభాగం జాయింట్ సెక్రెటరీగా
బాధ్యతలు స్వీకరించిన పరికిపండ్ల నరహరికి సన్మానం
హైదరాబాద్, మే 14, ( అద్దం న్యూస్ ) : భారతదేశ భూ వనరుల విభాగం జాయింట్ సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించిన పరికిపండ్ల నరహరి ( ఐఏఎస్ )కు ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, బీసీ జేఏసీ స్టేట్ కన్వీనర్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా, కోశాధికారి కేడి దినేష్ దాదా, సంయుక్త కార్యదర్శి జై శ్రీనివాస్ దదా, రాకేష్ తదితరులు పరికిపండ్ల నరహరిని మర్యాదపూర్వకంగా కలిసి భారతదేశ భూ వనరుల విభాగం జాయింట్ సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించినందుకుగాను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అశోక్ దాదా మాట్లాడుతూ… ఆరె కటి అభివృద్ధి సంఘం ప్రధాన సలహాదారుగా కూడా పరికిపండ్ల నరహరి విశిష్ట సేవలను అందిస్తున్నారన్నారు.














Leave a Reply