ప్రభుత్వ భూముల్లో పేద ప్రజలకు ఇండ్ల నిర్మించి పట్టాలు ఇవ్వాలి – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణయ్య

 

ప్రభుత్వ భూముల్లో పేద ప్రజలకు ఇండ్ల నిర్మించి పట్టాలు ఇవ్వాలి

– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణయ్య

                                                                             హాజ‌రైన గుడిసెవాసులు

హైదరాబాద్, ఏప్రిల్ 28, అద్దం న్యూస్ :   ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇండ్ల నిర్మించి పట్టాలు వెంటనే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ‌ గుడిసె వాసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాకీ రవి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద గుడిసె వాసులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ బిఎన్ రమేష్ కుమార్ మాదిగ లు హాజరై మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల మంది పేద ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు ఇంటి అద్దెలు చెల్లించలేక బ్రతుకు భారమే జీవిస్తున్నారని ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద ప్రజల జీవితాలు మార్పు వస్తుందని ఇందిరమ్మ రాజ్యం కావాలని రాష్ట్రంలో పేద ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేస్తే నాయకులు పేద ప్రజల కడుపు కొడుతూ తమ పొట్టలు నింపుకుంటున్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసించే ఇండ్లు లేని పేదలకు 100 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు హైదరాబాద్‌లో గతంలో కాచువాన్, సింగారం, తట్టి అన్నారం, ఆర్కే నగర్ లో ఇండ్ల పట్టాలు ఇచ్చి ప్రభుత్వ స్థలాలు కేటాయించకుండా పోసిషన్ ఇవ్వకుండా 4000 మందికి మొండి చేయి చూపారని వీరికి వెంటనే స్థలం చూపించి పట్టాలు ఇవ్వాలని కోరారు. అలాగే కుంట్లూరులో పేదలు గుడిసెలు వేసుకున వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని ఉండడంతో ఎండ తీవ్రతకు గుడిసెలు కాలిపోతున్నాయని కాలిపోయిన ఇంటికి లక్ష పరిహారం ఇచ్చి వెంటనే వారికి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. వెంటనే పేద ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అనంతయ్య, పగిళ్ల సతీష్ గొరిగి మల్లేష్, రాజేందర్ గుడిసె వాసుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కుశాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ములుగు నవీన్, కోశాధికారి గ్యార ఉపేందర్, దొడ్ల సాగర్ మందుల ఐమన్న, చిరంజీవి, సోమయ్య, సోమవారం వెంకయ్య, కొంగరి విష్ణు, అనిల్ కుమార్, మ, తదితర నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page