హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ దోమలగూడ హనుమాన్ దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం జరిగింది. 5 మాసాలకు సంబంధించిన ఈ హుండి లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ బి.సురేఖల పర్యవేక్షణలో జరిగింది. ఆలయ హుండీ లక్కింపు చేయగా ఒక లక్షా 42 వేల 606 రూపాయల ఆదాయం వచ్చిందని ఈవో దేవనాధం తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో కెఆర్‌కె.ప్రసాద్, ఆలయ మాజీ చైర్మన్ గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్, సలంద్రి శ్రీనివాస్ యాదవ్, వేణు, విడి.కృష్ణ, కె.ప్రభు, అర్చకులు మహేందర్, భక్తులు శేషాచార్యులు, హరికృష్ణ, వెంకటేశ్వరస్వామి, బి.వెంకటేష్, నిఖిల్ కుమార్, సిహెచ్.ప్రశాంత్, శశివర్ధన్, వికాస్, సీతారామ్, వినయ్, వినయ్ కుమార్, రామారావు, కిరణ్‌కుమార్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply