Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadన‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యాన్ని సంద‌ర్శించిన హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న‌

న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యాన్ని సంద‌ర్శించిన హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న‌

📰 Generate e-Paper Clip

న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యాన్ని సంద‌ర్శించిన హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న‌

హైదరాబాద్, జులై 30, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో గ‌ల‌ న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యాన్ని హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న బుధ‌వారం సంద‌ర్శించారు. గ్రంథాలయాన్ని పరిశీలిస్తూ విద్యార్థులకు అందిస్తున్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పుస్తకాల విభాగాలు, ప్రీజర్వేషన్ సెక్షన్, పిల్లల విభాగం, మహిళల ప్రత్యేక విభాగం ఇటీవల ప్రత్యేకంగా అంద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సెక్షన్ ను తదితర అన్నీ సెక్షన్లను పరిశీలించారు. రికార్డుల‌ను ప‌రిశీలించారు. కలెక్టర్ గ్రంథాలయంలోని అన్ని విభాగాలను పూర్తి స్థాయిలో పరిశీలించి, విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన మరింత వసతులపై దృష్టి పెట్టే విధంగా అధికారుల‌కు సూచనలు చేశారు. గ్రంథాలయంలో చదువుతున్న విద్యార్థులు కలెక్టర్ ను కలిసి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు త్వరగా విడుదల చేయాలన్న అభ్యర్థనతో వినతి పత్రం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఉదయం సమయంలో ఐదు రూపాయల అల్పాహారము ఏర్పాటు చేయాలని ముషీరాబాద్ త‌హ‌శిల్థార్ రాణా ప్ర‌తాప్ సింగ్‌కు క‌లెక్ట‌ర్ ఆదేశించారు. క‌లెక్ట‌ర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్ శ్రీ పలని కదిరవన్, హైదరాబాద్‌ నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పద్మజ, ముషీరాబాద్ త‌హ‌శిల్థార్ రాణా ప్ర‌తాప్ సింగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page