హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ విద్యానగర్ ఎస్విఎస్ గ్రౌండ్లో ఆదివారం హ్యుండాయ్ స్టాల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ముషీరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్ కుమార్ హాజరై స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉన్న కార్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ప్రోత్సాహక బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాంబాబు, విద్యార్థి అరుణ్, కిషోర్, శ్రీనివాస్, శ్రీధర్, నవీన్, రజిని తదితరులు పాల్గొన్నారు.












Leave a Reply