నేను ఎవ్వరికి భయపడను… బిఆర్ఎస్‌లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్ – మీడియాతో చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కవిత సంచ‌న‌ల వ్యాఖ్య‌లు

కెటిఆర్ పై డైరెక్ట్ అటాక్ కు దిగిన కవిత

నేను ఎవ్వరికి భయపడను

బిఆర్ఎస్‌లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్

♦ మీడియాతో చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కవిత సంచ‌న‌ వ్యాఖ్య‌లు

తెలంగాణ బ్యూరో, మే 29, అద్దం న్యూస్ :   కొన్ని రోజులుగా బిఆర్ఎస్‌లో అంత‌ర్గ‌త విభేదాలు కొన‌సాగుతున్న ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో కెటిఆర్ పై ఎమ్మెల్సి క‌విత డైరెక్ట్ అటాక్ కు దిగారు. త‌న పై విమ‌ర్శ‌లు చేసే వారిపై క‌విత‌ ఘాటుగా స్పందించారు. నేను జైలులో ఉన్నప్పుడే నాపై కుట్ర జరిగింది.. జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పాన‌ని.. కెసిఆర్ వ‌ద్ద‌న్నార‌న్నారు. గురువారం త‌న నివాసంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారని, ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లడిస్తున్నార‌ని.. కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులు త‌న పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆమె ఫైర్ అయ్యారు. డ‌బ్బులిచ్చి మ‌రీ న‌న్ను తిట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. బిఆర్ఎస్‌ను బీజేపిలో విలీనం‌చేసే కుట్ర జరుగుతోందని… బిజెపిలో బిఆర్ఎస్ విలీనం నూటికి 101 శాతం నేను వ్య‌తిరేకించాన‌ని క‌విత చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని.. ఆ పార్టీతో రాయబారాలు నాకెందుకు అని క‌విత అన్నారు. నామీద పడి ఏడిస్తే ఏమోస్తుంది.. నేను ఎవ్వరికి భయపడను… బీఆర్ఎస్‌లో కేసీఆర్ తప్ప ఇంకెవరీ నాయకత్వం అంగీకరించనని.. నాకు ఇంకెవరు నాయకులు లేరు.. బిఆర్ఎస్‌లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్ అని ఆమె మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. నేను కెసిఆర్‌కు రాసిన లేఖను లీక్ చేసిందెవరో చెప్పాలన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసనలు తెలపలేదని… కేవ‌లం ట్విట్ట‌ర్‌లో మెసేజ్‌లు పెడితే స‌రిపోతుందా అని క‌విత ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో ఇంకో నేతకు నోటీసులు ఇస్తే ఎందుకు హంగామా చేశార‌ని ప‌రోక్షంగా కెటిఆర్ ను ఉద్ధేశించి క‌విత ఘాటుగా వ్యాఖ్యానించారు. నా మీద ప‌డి ఏడిస్తే ఏమోస్తుంద‌న్నారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరుపున నేనే చేస్తున్నాన‌న్నారు. నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడంలేదు.. నాది బిఆర్ఎస్ పార్టీ అని.. . తాను కూడా కెసిఆర్‌లాగా తిక్క‌దాన్ని అని.. ఎవ‌రికి భ‌య‌ప‌డే ప్ర‌శ‌క్తి లేద‌ని… నా జోలికొస్తే బాగుండ‌ద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. తాను 25 ఏళ్లుగా నాన్న‌కు లేఖ‌లు రాస్తున్నాన‌ని… ప్ర‌తి సారి లేఖ‌ను చూసి చ‌దివి చించివేసేవార‌ని కానీ, ఈసారి ఏమైందో తెలియ‌దు కానీ.. ఆ లేఖ ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చిందో తెల‌పాల‌న్నారు. లీకు వీరుల‌ను బ‌య‌ట‌పెట్ట‌మంటే.. గ్రీకు వీరుల్లాగా నా పై దాడి చేస్తున్నార‌ని అన్నారు. కేసీఆర్ ను మేమే నడిపిస్తున్నామని కొందరు చెప్పుకుంటున్నారని… వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన చేసే కార్యాచరణ చేయనివ్వండి.. కానీ ట్వీట్ లకు మాత్రమె పరిమితం కావొద్దని క‌విత సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page