పాలకులు, అధికారులు వ్యాపారులైతే ప్రజల సంక్షేమం గాలిలో దీపం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబ

హైదరాబాద్, ఏప్రిల్ 2 ( అద్దం న్యూస్ ) : పాలకులు, అధికారులు వ్యాపారులైతే ప్రజల సంక్షేమం గాలిలో దీపమవుతుందని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబ అన్నారు. బుధ‌వారం దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాల్‌రాజ్ గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్. కిరణ్, శుక్రవేది తదితరులతో క‌లిసి సాయిబాబా మాట్లాడుతూ… రాష్ట్రంలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వమే టార్గెట్లు పెట్టి విక్రయించాలని చెప్పడం ప్రభుత్వ వ్యాపారం ధోరణికి నిదర్శనమని అన్నారు. 2025 – 2026 లో రూ.27,623 కోట్ల ఆదాయం రాబట్టాలని ఎక్సైజ్ శాఖా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇది గత ఏడాది కంటే దాదాపు 2 వేల కోట్లు ఎక్కువ లక్ష్యంగా నిర్ణయించారని.. ఇటీవల బీరు ధరలు పెంచడంతో ప్రతి నెలా సుమారు 170 కోట్ల ఆదాయం పెరిగిందని తెలిపారు. మధ్యం అమ్మకాలపై వేల కోట్లకు పైగా టార్గెట్లను నిర్దేశించి ప్రభుత్వం ఆదాయ మార్గంగా చూడటం విచారకరం సాయిబాబా అన్నారు. మధ్యపానాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వమే టార్గెట్లు విధించి ప్రోత్సహించడం దురదృష్టకరమని అన్నారు. త్యాగాల ఒకవైపు ఆదర్శాలు వల్లిస్తూ, త్యాగాల తెలంగాణాను తాగుబోతుల తెలంగాణాగా మార్చి, వేలాది మంది యువత, విధ్యార్థుల భవితను కాలరాస్తుందని విమ‌ర్శించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అని ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నాయకులకు ఇన్ని అక్రమాలు కళ్ల ముందు జరుగుతున్నా రాజకీయ లబ్ధికోసం ఢిల్లీ యాత్రలు చేయడం తెలంగాణా ప్రజల దౌర్బాగ్యమ‌న్నారు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి, ఈ నాటికి ఎన్నికల గురించి మాట్లాడక పోవడం ప్రభుత్వానికి ఓటమి భయమే అని సాయిబాబా అన్నారు. అదే విధంగా గత 40 రోజులుగా హెచ్‌సియు భూములు అమ్మవద్దని ఆందోళనలు నిర్వహిస్తున్నా హెచ్‌సియు భూములు అమ్ముకుని అక్రమ సంపాదన కోసం రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం కాంగ్రెస్ దోపిడి పాలనకు సంకేతమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో 3 దొమ్మీలు, 6 దోపీడిలుగా శాంతి భధ్రతలు క్షీణించినా పట్టించుకోని సృహ లేని రాష్ట్రప్రభుత్వం వల్ల అత్యాచారాలు పెరిగి పోతున్నాయని మండిప‌డ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోరారు. విచ్చలవిడిగా మధ్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎండగట్టాలని, ఏకమై ముక్తకంఠంతో ఖండించాలని, ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సాయిబాబా కోరారు. ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజా సంక్షేపాన్ని గాలికి వదిలేసి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. పాలకులకు నిజంగా ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే వెంటనే మద్యం విచ్చలవిడి మద్యం అమ్మకాలను నియంత్రించాలని అన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page