హెచ్‌సియు విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించండి
– పోలీసులను ఆదేశించిన భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ : హెచ్‌సియు వివాదంలో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హెచ్‌సియు వివాదం నిజానిర్ధారణకు అభిప్రాయ సేకరణ చేపట్టాలని మీనాక్షి నటరాజన్‌కు రాహుల్‌గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. ఆమె గత రెండు రోజులుగా హెచ్‌సియు అంశం పై జోరుగా చర్చలు చేస్తన్నారు. ఇందులో భాగంగా శనివారం సచివాలయంలో కంచ గచ్చిబౌళి భూముల పై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని కలిసి అభిప్రాయాలను తీసుకున్నారు. ఆదివారం హెచ్‌సియు అధ్యాపకులతో సమావేశమైన ఆమె హెచ్‌సియులో పోలీస్ భద్రతపై వెనక్కి తీసుకోవాలని, ఇకపై క్యాంపస్ లో శాంతి భద్రతల బాధ్యత యూనివర్సిటీదే మంత్రి భట్టి విక్రమార్కను మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. ఇందుకు స్పందించిన మంత్రి భట్టి విక్రమార్క సోమవారం సచివాలయంలో హెచ్‌సియు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి చర్చలు జరిపారు. అనంతరం హెచ్‌సియు నుంచి పోలీస్ బలగాలు ఉపసంహరణ చేసుకుంటున్నట్లు వీసీకి లేఖ రాశారు. ఈ మేరకు హెచ్‌సియులో పోలీస్ భద్రతపై వెనక్కి తీసుకోవాలని, హెచ్‌సియు విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని భట్టి ఆదేశించారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇదిలా ఉండగా ఈ నెల 8, 9 తేదీల్లో అహ్మదాబాద్‌లో జరుగనున్న ఏఐసిసి విస్త్రతస్థాయి సమావేశంలో రాహుల్‌గాంధీకి హెచ్‌సియు కు సంబంధించిన నివేదికను మీనాక్షి నటరాజన్ అందచేయనున్నట్లు తెలిస్తోంది.














Leave a Reply